తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరు శాతం పెరిగిన 'హాల్'​ ఆదాయం - ఆర్థిక సంవత్సరం2018-19

2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రంగ సంస్థ 'హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​(హాల్​)' ఆదాయం 6 శాతం పెరిగి రూ.19,400 కోట్లకు చేరింది.

హాల్

By

Published : Apr 2, 2019, 12:24 AM IST

ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​​ లిమిటెడ్​ (హాల్​)' ఆదాయంలో 6 శాతం వృద్ధి నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.19,400 కోట్ల ఆదాయం గడించింది. ఇది 2017-18లో 18,284 కోట్లుగా ఉంది.

"2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ పనితీరు మెరుగుపడింది. ఇది దేశీయంగా కొత్త డిజైన్లు, సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. "
-ఆర్​.మాధవన్​, హాల్​ ప్రధాన మేనేజింగ్​ డైరెక్టర్​

గడిచిన ఆర్థిక సంవత్సరంలో 41 కొత్త విమానాలు, హెలికాప్టర్​లు, 98 కొత్త ఇంజిన్ల ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది హాల్​. అదే విధంగా 213 విమానాలు, హెలికాప్టర్​లతో సహా 540 ఇంజిన్లకు మరమ్మతులు చేసినట్లు తెలిపింది.

"భారత సైన్యం కోసం తయారుచేస్తున్న 40 తేలికపాటి హెలికాప్టర్​లలో ఇప్పటికే 12 అందించాం. త్వరలోనే మరో ఆరు అందిస్తాం."

- హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​

ABOUT THE AUTHOR

...view details