తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాలోనూ భారీగా పెరిగిన 'హెచ్​ఏఎల్​​' ఆదాయం - హిందుస్థాన్​ ఎరోనాటిక్స్ లిమిటెడ్​

ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్​ ఎరోనాటిక్స్ లిమిటెడ్​ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.22,700 కోట్ల ఆదాయాన్ని గడించింది. గత ఏడాదితో పోలిస్తే.. 6శాతం ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది.

HAL records revenue
హిందుస్థాన్​ ఎరోనాటిక్స్ లిమిటెడ్

By

Published : Apr 1, 2021, 5:08 AM IST

కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడినా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(హాల్​).. భారీ ఆదాయాలను నమోదు చేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రూ.22,700 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది.

ఈ సంస్థ ఆదాయం 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.21,438 కోట్లుగా ఉంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం 6 శాతం పెరిగినట్లు హాల్​ తెలిపింది. ఉత్పత్తిలో పెరుగదలే దీనికి కారణం అని వెల్లడించింది.

2020-2021 ఆర్థిక సంవత్సరంలో 41 కొత్త విమానాలు, హెలికాప్టర్లు, 102 ఇంజిన్లను తయారు చేసినట్లు హాల్​ తెలిపింది. మరో 198 విమానాలు, హెలికాప్టర్లను మరమ్మతు చేసినట్లు వెల్లడించింది. ఖర్చు తగ్గింపు చర్యలు కూడా సంస్థ ఆదాయం పెరుగుదలకు దోహదం చేసినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:టీనేజర్లకూ మా టీకా సురక్షితం : ఫైజర్

ABOUT THE AUTHOR

...view details