తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎస్టీ మండలి 36వ సమావేశం వాయిదా

నేడు జరగాల్సిన జీఎస్టీ కౌన్సిల్ 36వ సమావేశం వాయిదా పడింది. సమావేశం నూతన తేదీని త్వరలో ప్రకటిస్తామని మండలి అధికారులు తెలిపారు.

జీఎస్టీ మండలి

By

Published : Jul 25, 2019, 6:57 PM IST

Updated : Jul 25, 2019, 10:43 PM IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంటు సమావేశాల్లో ఉన్న కారణంగా జీఎస్టీ మండలి 36వ సమావేశం వాయిదా పడింది. సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు సమావేశం నిర్వహించాలని మండలి భావించింది.

విద్యుత్ వాహనాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోదం లభించాల్సి ఉంది.

సౌర విద్యుత్ ప్రాజెక్టులపై జీఎస్టీ పన్నుల విధానాన్ని పునఃసమీక్షించాలని మండలికి దిల్లీ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ అంశంపైనా సమీక్షించాల్సి ఉంది.

జీఎస్టీ సమావేశం నూతన తేదీని త్వరలో వెల్లడిస్తామని కౌన్సిల్ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఏడాదిలో వాట్సాప్ పేమెంట్ సేవలు

Last Updated : Jul 25, 2019, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details