అక్టోబర్‌లోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా తగ్గాయి. గత నెల కేవలం రూ.95,380 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. 2018 అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1,00,710 కోట్లుగా ఉండటం గమనార్హం.
జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల కన్నా తక్కువగా నమోదవ్వడం వరుసగా ఇది మూడో నెల. అక్టోబర్‌లో పండుగ సీజన్‌తో వసూళ్లు పెరుగుతాయని భావించినా.. ప్రభావం కనిపించలేదు. సెప్టెంబర్‌లో అత్యల్పంగా రూ.91,916 కోట్ల జీఎస్టీ మాత్రమే వసూలైంది.