తెలంగాణ

telangana

ETV Bharat / business

స్థూల నిరర్ధక ఆస్తుల నిర్వహణ మెరుగుపడింది: ఆర్బీఐ

బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు, నికర నిరర్ధక ఆస్తుల విలువ మెరుగుపడినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్​ నాటికి 9.1శాతానికి చేరినట్లు ప్రకటించింది.

rbi
ఆర్బీఐ

By

Published : Dec 24, 2019, 10:26 PM IST

Updated : Dec 24, 2019, 10:39 PM IST

బ్యాంకుల స్థూల నిరర్ధక రుణాల నిర్వహణ(గ్రాస్​ నాన్​-పర్ఫార్మింగ్​ లోన్స్​) మెరుగుపడినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)​ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఇది 9.1 శాతానికి చేరినట్టు పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 11.2 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది.

అన్ని వాణిజ్య బ్యాంకుల నికర నిర్ధక ఆస్తుల (ఎన్​పీఏ) 2019-20 ఆర్థిక సంవత్సరంతో 3.7 శాతానికి తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
ముఖ్యంగా ప్రభుత్వ రంగ రుణ సంస్థల్లో ఆస్తుల నిర్వహణ మెరుగుపడటం.. స్థూల, నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి తగ్గుదలకు కారణంగా ఆర్బీఐ పేర్కొంది.

స్థూల ఎన్​పీఏ, నికర ఎన్​పీఏల నిష్పత్తి తగ్గడం వల్ల.. ప్రభుత్వం ఆస్తుల నిర్వహణ మెరుగుపడిందని ఆర్బీఐ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:'హ్యాపీ న్యూ ఇయర్' పేరుతో జియో అదిరే ఆఫర్​

Last Updated : Dec 24, 2019, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details