విమానాశ్రయాల ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. రెండో విడతలో 20 నుంచి 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర వెల్లడించారు. తొలి విడతలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించింది ప్రభుత్వం.
"ఇప్పుడు ప్రైవేటీకరించే 20 నుంచి 25 విమానాశ్రయాలు దేశంలో ప్రముఖమైనవి. వీటి ద్వారా ఏడాదికి 10 నుంచి 15 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు."
- గురుప్రసాద్ మహాపాత్ర, ఏఏఐ ఛైర్మన్