తెలంగాణ

telangana

ETV Bharat / business

వొడాఫోన్​ఐడియాలో ప్రభుత్వం చేతికి 36 శాతం వాటా - ప్రభుత్వం చేతికి వొడాఫోన్​ ఐడియా

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్​ ఐడియాలో 36 శాతం మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్లింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీలుగా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

Vodafone Idea
వొడాఫోన్​ఐడియా

By

Published : Jan 11, 2022, 12:48 PM IST

అప్పులతో సమతమతమవుతున్న వొడాఫోన్​-ఐడియాలో 36శాతం వాటా కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్లింది. బకాయిలను ఈక్విటీలుగా మార్చే ప్రక్రియలో భాగంగా సంస్థలోని 36శాతం షేర్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు వొడాఫోన్​ ఐడియా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో స్టాక్​ మార్కెట్​లో సంస్థ షేర్​ విలువ మంగళవారం సుమారు 14 శాతానికిపైగా పడిపోయింది.

ఈ నిర్ణయం కంపెనీ వాటాదారులకు, ప్రమోటర్లకు ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. స్పెక్ట్రమ్​ చెల్లింపులు, ఏజీఆర్​ బకాయిల రూపంలో ప్రభుత్వానికి రూ.1.6 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది.

"ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల వడ్డీ రూ.16వేల కోట్లుగా ఉంటుంది. 2021, ఆగస్టు 14 తేదీ నాటికి కంపెనీ షేర్ ధర ​ ముఖ విలువ కన్నా తక్కువ ఉంది. టెలికాం నియంత్రణ సంస్థ తుది నిర్ణయం మేరకు ప్రభుత్వానికి ఒక్కో షేర్​ రూ.10 చొప్పున అప్పగించనున్నాం. ఈ ప్రక్రియతో మా సంస్థలో ప్రభుత్వానికి రూ.35.8 శాతం షేర్లు అందుతాయి. వొడాఫోన్​ గ్రూప్​నకు 28.5 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్​నకు 17.8శాతం షేర్లు ఉంటాయి. "

- వొడాఫోన్​ ఐడియా.

2021, సెప్టెంబర్​ 30 నాటికి వొడాఫోన్​ ఐడియా అప్పులు మొత్తం రూ.1,94,780 కోట్లుగా ఉన్నాయి. అందులో స్పెక్ట్రమ్​ చెల్లింపులు రూ.1,08,610, ఏజీఆర్​ బకాయిలు రూ.63,400 కోట్లుగా ఉన్నాయి.

ఇదీ చూడండి:

అంబానీని మించిన జావో- ప్రపంచ కుబేరుడైన క్రిప్టో బిలియనీర్‌

ABOUT THE AUTHOR

...view details