ఎయిర్ఇండియా సహా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లలో పెట్టుబడుల విక్రయానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రెండు సంస్థల విక్రయానికి వచ్చే నెలలో తొలి దశ ఆసక్తి వ్యక్తికరణ (ఈఓఐ) బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రెండు సంస్థల్లో ఎయిర్ఇండియా రూ.58,000 కోట్లకు పైగా రుణాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఈ సంస్థ భారీ నష్టాలతో నడుస్తోంది.
వచ్చే నెలలో బిడ్లను ఆహ్వానించినా.. బీపీసీఎల్ విక్రయానికి సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి భారీ ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముంది.