ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాన్కోర్) సంస్థలను ప్రైవేటికరించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది మార్చిలోగా బీపీసీఎల్ విక్రయం పూర్తవుతుందని నిర్మలా సీతారామన్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ వాటాలు ఇలా..
ప్రస్తుతం బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి.. 53.29 శాతం వాటా ఉంది. ఈ వాటా మొత్తం విక్రయించి.. సంస్థ యాజమన్యాన్ని ప్రైవేటు చేయాలని కేంద్రం యోచన. ఎస్‌సీఐలో 63.75 శాతం వాటను, కాన్కోర్లో 30.9 శాతం పెట్టుబడులను ఊపసంహరించుకోవాలన్నది కేంద్రం ప్రణాళిక.
అదే విధంగా మరిన్ని ప్రభుత్వ సంస్థల నుంచి 51 శాతం కన్నా తక్కువకు.. ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనకు అంగీకరం తెలిపింది. ప్రధానంగా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాబితాలో ఉంది.