ఎంఎస్ఎంఈలకు పెద్ద పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు రూ.5 లక్షల కోట్లు బకాయి పడ్డాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 45 రోజుల్లోగా ఎంఎస్‌ఎంఈలకు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు బకాయిలు చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
ఎంఎస్ఎంఈలకు రూ.5 లక్షల కోట్ల బకాయిలు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు)కు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పెద్ద పరిశ్రమలు దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర బకాయిపడ్డాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
నితిన్ గడ్కరీ
ఎంఎస్‌ఎంఈల నగదు ఇలా ఇరుక్కుపోయిందని, అవేమో ఆర్థిక సంస్థలకు బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంఎస్‌ఎంఈలకు నగదు చెల్లించాలని, తమ శాఖలు, సంస్థలను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం ఎన్‌బీఎఫ్‌సీల కోసం తెచ్చిన పథకం.. రుణ లభ్యతలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.