తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ రిస్ట్ ​బ్యాండ్​​ మీ శరీర ఉష్ణోగ్రతను పసిగట్టేస్తుంది!

సరికొత్త స్మార్ట్​ రిస్ట్​​బ్యాండ్​​ను మర్కెట్​లోకి విడుదల చేసింది గోక్వీ టెక్​ సంస్థ. గోక్వీ విటల్​ 3.0 రిస్ట్​​లో అమర్చిన సెన్సర్స్​ సాయంతో మీ శరీర ఉష్ణోగ్రతలను ఇట్టే పసిగట్టేస్తుంది. కరోనా లక్షణాలు కనిపించినట్లయితే ముందుగానే తెలిజేస్తుందట గోక్వీ. దీనిలో అమర్చిన సాంకేతి పరిజ్ఞానం రెండు మార్గాల్లో ఉష్టోగ్రతను పర్యవేక్షిస్తుంది.

GOQii Vital 3.0 wristband comes with sensors to read body temperature
ఆ రిస్ట్ ​బ్యాండ్​​ మీ శరీర ఉష్ణోగ్రతను ఇట్టే పసిగట్టేస్తుంది!

By

Published : May 16, 2020, 4:38 PM IST

సరికొత్త స్మార్ట్​ రిస్ట్​బ్యాండ్​ను​ విపణిలోకి విడుదల చేసింది గోక్వీ టెక్​ సంస్థ. శరీర ఉష్టోగ్రతను పసిగట్టడం "గోక్వీ విటల్ 3.0" ప్రత్యేకత. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే ముందుగానే తెలియజేస్తుందట. ఈ వాచ్​ అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ వంటి ఆన్​లైన్​ మార్కెట్​​లో రూ. 3,999 ధరకు అందుబాటులో ఉంది.

"ప్రపంచంలోని పలు ప్రభుత్వాలు, ఆసుపత్రులు, పాఠశాలు, బీపీఓలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్​, ఫూడ్​ డెలివరీ, ఈ-కామర్స్​ సంస్థలు గోక్వీ విటల్​ 3.0ను ఉపయోగించడానికి మాతో చర్చలు జరుపుతున్నాయి." -విశాల్​ గొండల్, గోక్వీ సీఈఓ

పరీక్షల కంటే ముందే..

కొవిడ్​ పరీక్షల కంటే ముందే వ్యాధి లక్షణాలు కనిపెట్టడానికి​ భారత్​లో ఓ క్లినికల్​ సర్వే నిర్వహించడానికి జర్మన్​ అంకుర సంస్థ థ్రైవ్​తో, గోక్వీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుందని గొండల్​ తెలిపారు. కరోనా లక్షణాలను ముందుగానే కనిపెట్టడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందకుండా ఐసోలేషన్​లో ఉండేలా గోక్వీ విటల్​ 3.0 సహాయపడుతుందన్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించడంలో ఈ స్మార్ట్​ రిస్ట్​బ్యాండ్​​ విజయవంతంగా పని చేస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.

గోక్వీ విటల్​ 3.0లోని ఫీచర్స్​..

  • రెండు మార్గాలు ద్వారా ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తుంది. దీనిలో సహజంగానే ఉష్ణోగ్రతను అంచనా వేస్తుంది. అంతేకాకుండా సెన్సార్ ​ద్వారా థర్మల్ స్కాన్​ చేస్తుంది.
  • నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా... వినియోగదారులకు అవసరమైనప్పుడు వారి శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు.
  • శరీర ఉష్ణోగ్రతతో పాటు హృదయ స్పందన, నిద్ర... ఇలా రోజులో చేసే అన్ని కార్యక్రమాల గురించి తేలియజేస్తుంది.

ఇదీ చూడండి:లష్కరే స్థావరంపై దాడి- కీలక ముష్కరుడు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details