ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఇంటి నుంచి పని విధానాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు సీఈఓ సుందర్ పిచాయ్.
గూగుల్‌లో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, కరోనా వెలుగుచూసిన తొలినాళ్లల్లోనే ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించిన గూగుల్... అందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు ప్రతి ఉద్యోగికి వెయ్యి అమెరికన్ డాలర్ల అలవెన్సులు మంజూరు చేసింది.