దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ జియో ప్లాట్ ఫామ్స్‌లో రూ.33,737 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.7 శాతం వాటా గూగుల్‌కు దక్కనున్నట్లు తెలిపారు.
జియో ప్లాట్‌ఫామ్స్‌కు వచ్చిన పెట్టుబడులు ఆర్థిక భాగస్వామ్యం మాత్రమే కాదన్నారు ముకేశ్. భవిష్యత్ ప్రణాళికల్లో గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, క్వాల్కమ్ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వాములుగా ఉండనున్నట్లు వెల్లడించారు.