టెక్ దిగ్గజం గూగుల్‌తో భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదిరింది. డిజిటల్ ఇండియా నిర్మాణంలో ఇక నుంచి గూగుల్ పాలుపంచుకోనుంది. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది.
దేశంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఆలోచనలను వ్యక్త పరిచే వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
"దేశంలోని అన్ని ఇంజినీరింగ్ విద్యార్థులకు అన్ని విషయాల్లో సహాయం అందిస్తుంది. ఐఐటీతో పాటు సాధారణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, నూతన సాంకేతికతను అలవడేలా గూగుల్ కృషి చేస్తుంది. ఇందుకు గూగుల్ అంగీకరించినందుకు సంతోషంగా ఉంది."