ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థలు గూగుల్, ఒరాకిల్ మధ్య కాపీరైట్ వివాదం మరింత ముదిరింది. ఇరు సంస్థలు ఈ వ్యవహారంపై అమెరికా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాయి. బుధవారం ఈ కేసు విచారణకు రానుంది.
వివాదం ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి గూగుల్, ఒరాకిల్ మధ్య గత పదేళ్లుగా వివాదం కొనసాగుతోంది.
2007లో విడుదలైన ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం మిలియన్ల కొద్దీ కోడింగ్ లైన్లను గూగుల్ వినియోగించింది. అయితే అందులో 11,330 లైన్ల కోడింగ్‌ను తమకు చెందిన జావా ప్లాట్‌ఫామ్ నుంచి తీసుకున్నట్లు ఒరాకిల్ ఆరోపిస్తోంది.
అయితే ఇది టెక్ పరిశ్రమలో సాధారణంగా జరుగుతున్న ప్రక్రియేనని.. ఉత్తమ సాంకేతకతను రూపొందించేందుకు ఇది మంచిదేనని గూగుల్ తన చర్యను సమర్థించుకుంటోంది. అయితే ఒరాకిల్ మాత్రం గూగుల్ తమ కోడింగ్‌ను.. చట్టవిరుద్ధంగా వినియోగించుకుందని ఆరోపిస్తూ.. 8 బిలియన్ డాలర్ల దావా వేసింది.
ఈ వివాదంపై ట్రయల్ కోర్టులో గూగుల్‌కు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. అప్పీల్ కోర్టు ఆ తీర్పును అంగీకరించలేదు.
ఇదీ చూడండి:2021 నాటికి పుంజుకుంటాం.. కానీ!