తెలంగాణ

telangana

By

Published : May 8, 2020, 6:13 AM IST

ETV Bharat / business

కరోనా మోసాలపై గూగుల్​ తెలుగు వెబ్​సైట్​​ షురూ

కొవి​డ్​-19కు సంబంధించి గూగుల్​ ఇండియా పలు ప్రాంతీయ భాషల్లో నూతన వెబ్​సైట్​ను ప్రారంభించింది. ఆన్​లైన్ సమస్యలు, మోసాలపై ఈ వెబ్​సైట్​ సమాచారం అందిస్తుందని అధికారులు తెలిపారు.

Google India COVID-19 website
ఆన్​లైన్​ మోసాలను గుర్తించే గూగుల్​ 'కొవిడ్​-19 వెబ్​సైట్​'

కరోనా మహమ్మారికి సంబంధించిన మోసాలను గుర్తించేందుకు గూగుల్​ ఇండియా నూతన వెబ్​సైట్​ను ప్రారంభించింది. ఈ వెబ్​సైట్​ను మరాఠీ, తమిళం​, తెలుగు, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది సంస్థ. ఆన్​లైన్​ ద్వారా ఎదురయ్యే సమస్యలు, మోసాల గురించి ఈ వెబ్​సైట్​ సమాచారం అందించి..​ వినియోగదారులు సురక్షితంగా ఉండేందుకు సాయం చేస్తుందని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా కొద్ది వారాలుగా కొవిడ్​-19కు సంబంధించి రోజుకు 18 మిలియన్ల ఆన్​లైన్​ మోసాలు గుర్తించినట్లు గూగుల్​ అధునాత యంత్ర అభ్యాస బృందం తెలిపింది. వాటికి అదనంగా మరో 240 మిలియన్ల మోసపూరిత సందేశాలు ఉన్నాయని చెప్పింది.

"గూగుల్​ థ్రెట్​ అనాలసిస్​ బృందం హ్యాకింగ్​ చర్యలపై నిరంతరం నిఘా పెట్టింది. ఈ నిఘా వ్యవస్థ కొత్త రకం మోసాలను గుర్తించింది. అందులో కరోనాపై పోరాడుతున్న ఎన్​జీఓలు, ఛారిటీల మాదిరి ఈ-మెయిల్స్​, ఇంట్లో నుంచి పని చేసే ఉద్యోగులకు సంస్థ కొత్త మార్గదర్శకాలు పంపించటం వంటివి ఉన్నాయి. కరోనాపై నిరంతరం సేవలందిస్తూ కృషి చేస్తున్న వైద్యులనూ మోసగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. కొవిడ్​-19కు సంబంధించిన మోసాలు ప్రధానంగా ఈ-మెయిల్స్​ రూపంలోనే ఉంటున్నాయి. ఇంటి చిరునామా, బ్యాంకు వంటి వ్యక్తిగత వివరాల విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి."

– గూగుల్​ ఇండియా

అధునాత వ్యవస్థ..

ఆన్​లైన్​ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు అధునాత భద్రత వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించింది గూగుల్​. దీని ద్వారా వినియోగదారులకు చేరే లోపే స్వయంచాలితంగా స్పామ్​ను గుర్తించి.. నిలువరిస్తుందని తెలిపింది.

జీ-మెయిల్​లో..

జీ-మెయిల్​లో ఇప్పటికే గూగుల్​ మిషన్​ లర్నింగ్​ మోడల్స్​ ద్వారా 99.9 శాతం స్పామ్​, ఫిషింగ్​, మాల్వేర్​ను గుర్తించి, తొలగించామని వెల్లడించింది. క్రోమ్​ బ్రౌజర్​లోనూ ఈ భద్రత వ్యవస్థను తీసుకరావడం వల్ల.. ఏదైనా తప్పుడు వెబ్​సైట్​ ఓపెన్​ చేస్తే హెచ్చరిస్తుందని.. గూగుల్​ ప్లే ప్రొటెక్ట్​ స్కాన్​ ద్వారా మిలియన్ల కొద్ది యాప్స్​ సురక్షితంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

ప్రముఖ సామాజిక మాధ్యమాల ఖాతాలు, ఆరోగ్య సంస్థలు సహా కరోనా వైరస్​ అధికారిక మ్యాప్స్​ సైన్​-ఇన్​ పేజీల మాదిరిగా ఉండే మాల్​వేర్​లను గుర్తించామని తెలిపింది సంస్థ.

ABOUT THE AUTHOR

...view details