గూగుల్‌కు చెందిన డ్యుయో చాట్ అప్లికేషన్‌లో మార్పులు చేసింది. వీడియో కాలింగ్ సౌకర్యాన్ని ఒక గ్రూపులో 12 నుంచి 32 మందికి పెంచింది. ఎక్కువ మంది గ్రూప్‌లో కలిసి ఉంటే భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుంది అని పేర్కొంది.
'ఎప్పటి నుంచో వినియోగదారులు అడుగుతున్నట్లు డ్యుయో వెబ్ గ్రూప్ కాలింగ్‌లో సభ్యుల సంఖ్యను పెంచాం. దీనిలో 32 మంది వరకు పాల్గొనవచ్చు. దీనికోసం కొత్త వెర్షన్ క్రోమ్‌ను వినియోగించాలి' అని గూగుల్ సీనియర్ డైరెక్టర్ సనజ్ అహరి పేర్కొన్నారు.