తెలంగాణ

telangana

ETV Bharat / business

టాప్​ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​కు గూగుల్​ సేవలు బంద్

హువావే స్మార్ట్ ఫోన్లకు సేవలు నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. గతవారం హువావేపై ట్రంప్ ఆంక్షలు విధించిన కారణంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

హువావే

By

Published : May 20, 2019, 11:54 AM IST

చైనా స్మార్ట్​ ఫోన్ దిగ్గజం హువావేకు షాక్ ఇచ్చింది టెక్​ దిగ్గజం గూగుల్. హువావేకు ఆండ్రాయిడ్ లైసెన్స్​ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

గూగుల్ నిర్ణయంతో హువావే భవిష్యత్​ ఫోన్లకు గూగుల్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫోన్లకు ఆండ్రాయిడ్​ ఆప్​డేట్స్ ఉండవు. వీటితో పాటు గూగుల్​ ప్రధాన యాప్స్ అయిన యూట్యూబ్​, మ్యాప్స్ సహా ఇతర సేవలు నిలిచిపోనున్నాయి.

కారణమేంటి...?

అమెరికా సంస్థలు హూవావేకు సాంకేతికతను అందించే విషయంపై గతవారం ఆంక్షలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్. హువావేను ఎన్టిటీ లిస్టులో చేర్చారు.

ఈ అంక్షల ప్రకారం హువావే అమెరికా సంస్థల సాంకేతికతను పొందాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి.

ఈ ఆదేశాల అమలులో భాగంగానే హువావేకు సేవలు నిలిపివేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.

హూవావే కొత్త ఓఎస్​​?

గూగుల్ నిర్ణయంపై స్పందించేందుకు నిరాకరించింది హువావే. అయితే రెండు నెలల క్రితం ఓ జర్మన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమకు గూగుల్ సేవలు అందించకపోతే ప్రత్యామ్నాయంగా కొత్త మొబైల్​ ఆపరేటింగ్ సిస్టమ్​ను రూపొందిస్తున్నట్లు తెలిపారు హువావే సీఈఓ రిచర్డ్ యూ.

మరి గూగుల్​తో హూవావే చర్చలు జరుపుతుందో? కొత్త ఓఎస్​ని అందుబాటులోకి తెస్తుందో? వేచి చూడాలి.

ఇదీ చూడండీ: వాణిజ్య యుద్ధం 2.0: బ్లాక్​లిస్ట్​లో హువావే

ABOUT THE AUTHOR

...view details