తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్​ సాయం కావాలా? 'మీనా'తో మాట్లాడాల్సిందే! - గూగుల్ మీనా

గూగుల్​ సరికొత్త చాట్​బాట్​ను రూపొందించింది. కృత్రిమ మేధ సాయంతో మనిషిలా స్పందించే 'మీనా'.. ప్రపంచంలో ఏ విషయంపైనైనా మనతో మాట్లాడగలదని గూగుల్ చెబుతోంది. ఇంటర్నెట్​లో సేవలందిస్తున్న మరే ఇతర చాట్​బాట్​తో పోల్చినా మీనా అత్యుత్తమమని అంటోంది.

google meena
గూగుల్ మీనా

By

Published : Feb 22, 2020, 5:52 PM IST

Updated : Mar 2, 2020, 5:03 AM IST

చాట్​బాట్​.. ప్రతి వెబ్​సైట్​ తన సందర్శకులతో సంభాషించేందుకు ఉపయోగించే టూల్​. ఇంటర్నెట్​లో వేర్వేరు అవసరాల కోసం అనేక చాట్​బాట్స్​ అందుబాటులో ఉన్నాయి. రోజురోజుకు వీటిలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కృత్రిమ మేధ రాకతో చాట్​బాట్​లను మరింత అభివృద్ధి చేస్తున్నాయి వెబ్​సైట్లు.

గూగుల్​ చాట్​బాట్​

కొన్ని రోజులుగా ప్రత్యేకమైన చాట్​బాట్​ రూపొందించే పనిలో ఉంది దిగ్గజ సంస్థ గూగుల్​. తను తీసుకురాబోయే చాట్​బాట్​ ప్రపంచంలోనే అత్యుత్తమం అని చెబుతోంది. ప్రపంచంలో ఏ విషయం గురించి అడిగినా సమాధానం ఇస్తోందని పేర్కొంది గూగుల్​.

గూగుల్​ తీసుకురాబోయే ఈ మోస్ట్ అడ్వాన్స్​డ్​ చాట్​బాట్​ పేరు 'మీనా'. ఈ చాట్​బాట్​లో సంభాషణకు సంబంధించిన న్యూరల్ నెట్​వర్క్​లో 2600 కోట్ల పారామీటర్స్ ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. ఫలితంగా మిగతా చాట్​బాట్స్​ కన్నా వినియోగదారుడితో మీనా చక్కగా సంభాషిస్తుందని తెలిపింది.

మీనా ఎలా పనిచేస్తుంది?

మీనాకు సీక్వెన్స్ ​టూ సీక్వెన్స్​ మోడల్​లో శిక్షణ ఇచ్చేందుకు 341 జీబీ టెక్స్ట్ డేటాతో పాటు 4,000 కోట్ల పదాలను ఉపయోగించింది. ఈ మోడల్​ ద్వారా పేరాలో పదాల మధ్య తేడాను గుర్తించి మీనా అర్థం చేసుకోగలుగుతుంది.

మీనాలో ఒక ఎవాల్వ్​డ్​ ట్రాన్స్​ఫార్మర్​ ఎన్​కోడర్​తోపాటు 13 డీకోడర్లను ప్రోగ్రామ్​ చేసింది గూగుల్. మనం ఇచ్చే సమాచారాన్ని ఎన్​కోడర్​ అర్థం చేసుకుని డీకోడర్ల ద్వారా తిరిగి మనతో మాట్లాడుతుంది.

మనిషికి దగ్గరగా...

చాట్​బాట్స్​కు గూగుల్​ కొత్తేమీ కాదు. 2015లోనే సాంకేతిక సహాయత కోసం ఓ మోడల్​ను విడుదల చేశారు. అంతేకాకుండా సంభాషణను అర్థం చేసుకునేలా అనేక భాషల మోడళ్లను గూగుల్ రూపొందించింది.

మానవుడిలా కాకపోయినా.. ఆ స్థాయిలో స్పందించేలా మీనాను రూపొందించింది. ప్రపంచంలో ఏ విషయంపైనైనా తను మాట్లాడగలదు.

అయితే బాహ్య ప్రపంచానికి మీనాను అందుబాటులోకి తీసుకురాలేదు గూగుల్​. భవిష్యత్తులో రావచ్చేమో మరి!

ఇదీ చూడండి: 'బ్రాండ్'​ మనదే.. పేరు మాత్రమే విదేశీ!

Last Updated : Mar 2, 2020, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details