తెలంగాణ

telangana

ETV Bharat / business

నిమిషానికి 5 వేల ప్రకటనలపై గూగుల్ వేటు - గూగుల్ తాజా ప్రకటనలు

నకిలీ ప్రకటనలు ఇస్తూ వినియోగదారులను మోసగిస్తున్నవారిపై చర్యలు తీసుకున్నట్లు సెర్చ్​ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. 2019లో 270 కోట్ల చెత్త ప్రకటనలు, 12 లక్షల ఖాతాలను తొలగించినట్లు ప్రకటించింది. కరోనాకు సంబంధించిన నకిలీ ప్రకటనలపైనా దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది.

Google
గూగుల్

By

Published : May 5, 2020, 6:06 AM IST

Updated : May 5, 2020, 7:26 AM IST

సెర్చ్​ ఇంజిన్​ దిగ్గజం గూగుల్​ 2019లో రికార్డు స్థాయిలో 'చెత్త' ప్రకటనలను తొలిగించినట్లు వెల్లడించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నవి, గూగుల్​ నిబంధనలను ఉల్లంఘించిన ప్రకటనలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

ఏడాదిలో 270 కోట్ల ప్రకటనలను తొలగించటం లేదా బ్లాక్ చేసినట్లు గూగుల్​ స్పష్టం చేసింది. అంటే నిమిషానికి 5 వేల యాడ్​లను తీసేసింది. అంతేకాకుండా.. 2.1 కోట్ల వెబ్​ పేజీల నుంచి దాదాపు 12 లక్షల మంది ఖాతాలపై వేటు వేసింది.

కొవిడ్- 19 టాస్క్​ఫోర్స్..

కరోనా సంక్షోభం వేళ డిమాండ్​ పెరిగిన మాస్కులకు సంబంధించి నకిలీ ప్రకటనలనూ గుర్తించినట్లు గూగుల్ తెలిపింది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే నకిలీలపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు గూగుల్ ప్రకటన విభాగం ఉపాధ్యక్షుడు స్కాట్ స్పెన్సర్​.

" మా మాధ్యమాల్లో సమగ్రతను కాపాడతాం. కరోనా సంక్షోభంలోనూ మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. మా విధానాలు, నిబంధనలను ఉల్లంఘించేవారిని తొలగిస్తాం. వినియోగదారుల, ప్రకటనదారుల భద్రత కోసం వేలాది మంది గూగుల్ ఉద్యోగులం పనిచేస్తున్నాం."

- స్కాట్ స్పెన్సర్, గూగుల్ ప్రకటన విభాగం

ఇందుకోసం కొవిడ్​- 19 టాస్క్​ఫోర్స్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు స్కాట్ తెలిపారు. కొన్ని నెలలుగా కరోనా సంబంధిత తప్పుడు ప్రచారాలను తొలగిస్తున్నామని వెల్లడించారు. నిరుద్యోగం, వైద్య పరికరాలు, మందుల కొరత ఇలా అనేక రకాల అంశాలపై దృష్టి పెట్టామన్నారు.

Last Updated : May 5, 2020, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details