మొబైల్లో గూగుల్ యాప్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది? సెర్చ్ బార్. మిగిలిన పేజ్ అంతా దాదాపు ఖాళీ. ఇకపై అలా ఉండదు.
మొబైల్ యాప్ హోం పేజీపై వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసేందుకు సిద్ధమైంది టెక్ దిగ్గజం గూగుల్. ఆదాయం పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
వినియోగదార్లకు మరింత దగ్గరయ్యేందుకు అన్లైన్ షాపింగ్ సంస్థలకు ఈ యాడ్లు ఉపకరిస్తాయని గూగుల్ పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రకటనదార్లకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.