తెలంగాణ

telangana

ETV Bharat / business

E Commerce sales: పండగ సీజన్​లో రూ.65వేల కోట్ల విక్రయాలు - ఫ్లిప్​కార్ట్​ విక్రయాలు

ఈ ఏడాది పండగ సీజన్​లో ఇ-కామర్స్ (E Commerce sales)​ సంస్థలు గతేడాది కంటే 23 శాతం అధిక విక్రయాలు(festival sales online) చేశాయి. ఏకంగా రూ.65వేల కోట్లు మేర అమ్మకాలు జరిగాయని కన్సల్టింగ్​ సంస్థ రెడ్​సీర్​(redseer ecommerce report) అంచనా వేసింది.

E commerce business
పండగ సీజన్​లో 'ఈ-కామర్స్​' భళా

By

Published : Nov 14, 2021, 7:07 AM IST

ఈ ఏడాది పండగ సీజనులోనూ (festival sales online)) ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ దుమ్మురేపాయి. గతేడాది ఇదే సీజన్‌ విక్రయాలు 7.5 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.52,000 కోట్లు)తో పోలిస్తే ఈసారి 23 శాతం అధికంగా 9.2 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.65,000 కోట్లు) మేర అమ్మకాలు(e commerce festive sale) జరిగాయని కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌(redseer ecommerce report) అంచనా వేస్తోంది.

"సరికొత్త ఉత్పత్తులకు తోడు.. సులభ వాయిదాల్లో కొనుగోళ్లకు అవకాశం లభించడం ఇందుకు కారణమైంది. మొత్తం విక్రయాల్లో (E Commerce sales)మొబైల్స్‌ వాటా విలువ మూడో వంతు కంటే ఎక్కువే"

- రెడ్‌సీర్‌

ఆ నివేదిక ఇంకా ఏమంటోందంటే..

  • చాలా రోజుల తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళుతుండడంతో ఫ్యాషన్‌(amazon festival sale 2021) విభాగంలో విక్రయాలు రెండింతలయ్యాయి.
  • హోం ఫర్నిచరు, డెకరేషన్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల్లో వృద్ధి స్తబ్దుగా నిలిచింది.
  • రెండో అంచె నగరాల నుంచే 57 శాతం మంది కొనుగోలుదార్లు నమోదయ్యారు. వీరి సంఖ్య పెరిగినా, ఒక్కో వినియోగదారు సగటు మాత్రం రూ.6570 నుంచి రూ.6490కి తగ్గింది.
  • ఫ్లిప్‌కార్ట్‌ 62% మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోగలిగింది. కొత్త ఆఫర్లు, ఆవిష్కరణలతో అమెజాన్‌, స్నాప్‌డీల్‌, మింత్రాలు సైతం వినియోగదార్లను ఆకట్టుకోగలిగాయి.

ఇదీ చూడండి:'ఆన్​లైన్​ షాపింగ్'​లో అదనపు క్యాష్​బ్యాక్.. ఎలాగంటే?​

ABOUT THE AUTHOR

...view details