తెలంగాణ

telangana

ETV Bharat / business

'నైతిక విలువలుంటేనే మంచి వ్యాపారం' - వ్యాపారాలపై మహీంద్రా సర్వే

75 వార్షికోత్సవం సందర్భంగా మహీంద్రా గ్రూప్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా మదుపరులు, వినియోగదారులు, ఉద్యోగుల కోణంలో మంచి వ్యాపారం ఎలా ఉండాలో నివేదిక రూపొందించింది. ఆ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి.

Good business is about ethical standards
నైతిక విలువలతోనే మంచి వ్యాపారం

By

Published : Nov 19, 2020, 12:39 PM IST

'ప్రస్తుత పరిస్థితుల్లో మంచి వ్యాపారం అంటే నైతిక విలువలు పాటించాలి. సమాజాన్ని సంరక్షించుకోవడం, అందరినీ మమేకం చేయడం'.. అని మహీంద్రా గ్రూప్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

తమ గ్రూపు 75వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ సహా 10 మెట్రో నగరాల్లోని వ్యాపార, వృత్తిగత రంగాల ప్రతినిధులు 2,089 మంది అభిప్రాయాలను టెలిఫోన్‌ ద్వారా సమీకరించినట్లు సంస్థ తెలిపింది. మదుపర్లు, వినియోగదార్లు, ఉద్యోగుల కోణంలో మంచి వ్యాపారం ఎలా ఉండాలో నివేదిక రూపొందించింది.

మంచి వ్యాపారం చేసే వ్యక్తుల ఆలోచనలు ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఎలా మార్పు చెందుతున్నాయనేది ఇందులో ప్రస్తావించింది. మంచి వ్యాపారం అంటే వ్యక్తిగత విలువలు, జీవిత అనుభవాల ఆధారంగా ఏర్పడే లోతైన వ్యక్తిగత అభిప్రాయమని అధ్యయనంలో పేర్కొంది.

'వినియోగదార్లు, వాటాదార్లు, ఉద్యోగులు, సమాజ అంచనాలకు అనుకూలంగా వ్యాపారాల్లో మార్పులు రావల్సిన అవసరం ఉంది. ఇరు పక్షాలకూ మేలు జరిగేదే మంచి వ్యాపారం' అని అధ్యయన అంశాలపై మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:'వివాద్​ సే విశ్వాస్​'తో ప్రభుత్వానికి రూ.72,480 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details