తెలంగాణ

telangana

ETV Bharat / business

పేకాట కోసం రూ.38 కోట్ల కంపెనీ సొమ్ము బదిలీ.. అరెస్టు! - అశ్వణి

అంతర్జాతీయ ప్రముఖ పెట్టుబడి సంస్థ గోల్డ్​మన్ శాక్స్ ఉపాధ్యక్షుడు అశ్వణి జున్​జున్​ వాలాను అక్రమ లావాదేవీల కేసులో బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన జూనియర్ ఉద్యోగుల కంప్యూటర్​లతో.. సంస్థకు చెందిన దాదాపు రూ.38 కోట్లు అక్రమంగా లావాదేవీలు జరిపారని ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఇనుప చువ్వల వెనక్కి.. గోల్డ్​మన్​ శాక్స్​ ఉపాధ్యక్షుడు

By

Published : Sep 10, 2019, 9:09 PM IST

Updated : Sep 30, 2019, 4:16 AM IST

అన్​లైన్​ పేకాటలో రూ.38 కోట్ల కంపెనీ సొమ్మును వినియోగించుకున్న అరోపణలతో గోల్డ్​మన్ శాక్స్ ఉపాధ్యక్షుడు అశ్వణి జున్​జున్​ వాలాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

గోల్డ్​మాన్​ శాక్స్​ ఉద్యోగి అభిషేక్​ ప్రశీరా ఇచ్చిన.. ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జున్​జున్​ వాలాపై పలు ఐపీసీ సెక్షన్​ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పష్టం చేశారు.

అభిషేక్​ ఫిర్యాదులో ఏముందంటే..

జన్​జున్​ వాలా తన జూనియర్​ ఉద్యోగులైన గౌరవ్ మిశ్రా, అభిషేక్​ యాదవ్​, సుజిత్​ అప్పయ్య అనే వ్యక్తులకు సంబంధించిన ఆఫీస్​ కంప్యూటర్లను రివ్యూ పేరుతో వాడుకునేవాడు. ఇలా కంప్యూటర్​ వినియోగిస్తూ.. వారి కంప్యూటర్​లతో కంపెనీ ఖాతాలోకి అక్రమంగా లాగ్​ అయ్యి.. తనకు అనుకూల మైన బ్యాంక్​ ఖాతాలోకి డబ్బును బదిలీ చేసుకునే వాడు . ఇలా ఇప్పటి వరకు చైనా పారిశ్రమామిక, వాణిజ్య బ్యాంకు ఖాతాకు.. అక్రమంగా రూ.38 కోట్లు బదిలీ చేసుకున్నాడు.

గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడి ఉద్యోగం కోల్పోయిన వేదాంత్​ అనే వ్యక్తి హస్తం ఈ అక్రమ లావాదేవాల్లో ఉన్నట్లు అభిషేక్​ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీసీ టీవీ ఫుటేజీలు స్వాధీనం

జన్​జున్​ వాలా తన జూనియర్ల కంప్యూటర్​లోకి లాగ్​ ఇన్ అవ్వడం.. కంపెనీ సొమ్మును వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకోవడం వంటి దృష్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా జున్​జున్​ వాలా రెండు విడతల్లో 5.4 మిలియన్ డాలర్ల కంపెనీ సొమ్ములు తనకు అనుకూలమైన ఖాతాలోకి బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. సెప్టెంబర్​ 4న జరిగిన ఈ ఘటనపై ఆ ముగ్గురు తోటి ఉద్యోగులకు తెలియదా? వారూ ఈ మోసంలో పాలు పంచుకున్నారా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Last Updated : Sep 30, 2019, 4:16 AM IST

ABOUT THE AUTHOR

...view details