తెలంగాణ

telangana

ETV Bharat / business

​అక్షయ తృతీయ పసిడి అమ్మకాలు అదుర్స్​ - పెళ్లిళ్ల సీజన్​

అక్షయ తృతీయ పర్వ దినాన పసిడి కొనుగోళ్లు ఈ ఏడాది భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే విక్రయాలు దాదాపు 25 శాతం పుంజుకున్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా. పెళ్లిళ్ల సీజన్​, పసిడి ధరల్లో సానుకూలతలూ ఇందుకు కారణమన్నది నిపుణుల విశ్లేషణ.

​అక్షయ తృతీయ

By

Published : May 9, 2019, 1:53 PM IST

ఈ ఏడాది అక్షయ తృతీయ పర్వదినాన పసిడి అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 25 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నాయి.

బంగారు ధరలు అదుపులో ఉండటం, పెళ్లిళ్ల సీజన్​ కావడం ఇందుకు ఊతమందించాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే బంగారం ధర 7 శాతం తక్కువగా 10 గ్రాములకు రూ.32,000లకు పైగా ఉంది.

గడిచిన కొన్నేళ్లుగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్​టీ వంటి అంశాలు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా 2016 తర్వాత పసిడి అమ్మకాలు ఇంతలా పుంజుకోవడం ఇదే ప్రథమం.

"మేము చాలా సానుకూల నమ్మకంతో ఉన్నాము. గత ఏడాదితో పోలిస్తే పసిడి అమ్మకాలు 25 శాతం పెరిగి ఉంటాయని అంచాన వేస్తున్నాము. దేశవ్యాప్తంగా పసిడి వ్యాపారుల నుంచి సానుకూల నివేదికలు వస్తున్నాయి."
-అనంత పద్మనాభన్​, ఆల్ ఇండియా జెమ్స్​&జువెలరీస్ డొమస్టిక్​ కౌన్సిల్​ ఛైర్మన్​

"సానుకూల ధోరణులతో ఈ ఏడాది అమ్మకాలు బాగున్నాయి. వేసవి తాపం, పని దినం కారణంగా సాయంత్రం పని వేళలు ముగిసిన తర్వాత అమ్మకాలు భారీగా పెరిగాయి. "
-సౌరభ్​ గాడ్గిల్, ఇండియా బులియన్&జువెలర్స్​ అసోసియేషన్​ ఉపాధ్యక్షుడు

" దీర్ఘ కాలిక పెళ్లిళ్ల సీజన్​... బంగారు ఆభరణాల అమ్మకాలకు ప్రోత్సాహం అందించింది. పసిడి ధరలు తక్కవగా ఉండటం కూడా వినియోగదార్ల సెంటిమెంట్​ను బలపరిచింది. మెట్రో నగరాల్లో ఎక్కువగా యువత, మొదటి సారి బంగారు కొనుగోళ్లు జరిపే వారితో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇతర చిన్న పట్టణాల్లో ధరల సానుకూలతలు అమ్మకాలను ప్రోత్సహించాయి. దక్షిణ భారత్​లో కేరళ, కర్ణాటక భారీ అమ్మకాలు నమోదు చేశాయి. ఉత్తర భారత్​లో దిల్లీ, పంజాబ్​, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్మకాలు ఆకట్టుకున్నాయి."
-టీఎస్​ కళ్యాణ రామన్​, కళ్యాణ్ జువెలరీస్​ ఛైర్మన్​

గత ఏదాడితో పోలిస్తే ఈ ఏడాది అక్షయ తృతీయ పసిడి అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయని తనిష్క్​ జువెలరీస్​ సీనియర్​ ఉపాధ్యక్షుడు సందీప్ అన్నారు.

"దుకాణాలు తెరిచిప్పటి నుంచే వినియోగదార్ల తాకిడి పెరిగింది. వినియోగదార్లు అధికంగా బంగారు ఆభరణాలు, కాయిన్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. వినియోగదార్లు ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్లు జరపడం విశేషం. మా అమ్మకాల్లో 20 శాతం వృద్ధి నమోదైంది."
-ఆదిత్య, డబ్ల్యూహెచ్​పీ జువెలరీస్ డైరెక్టర్

ABOUT THE AUTHOR

...view details