పసిడి ధరలు ఇటీవలి రికార్డు స్థాయిల నుంచి కాస్త తగ్గినట్లు అనిపించినా... తిరిగి నేటి సెషన్లో భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.475 వృద్ధి చెందింది. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర దిల్లీలో రూ.38,420కు చేరింది.
దేశీయంగా నగల వ్యాపారుల నుంచి పెరిగిన గిరాకీతో పుత్తడి ధరలు పుంజుకున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది.
బంగారం బాటలోనే వెండి ధరలూ పుంజుకున్నాయి. కిలో వెండి ధర దిల్లీలో రూ.378 పెరిగి.. రూ.44,688కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల కొనుగోళ్ల వృద్ధితో వెండి ధరలు పెరిగాయి.