తెలంగాణ

telangana

ETV Bharat / business

గో ఎయిర్​ నూతన సీఈఓగా వినయ్​ దూబె - Wadia group

గో ఎయిర్​ నూతన సీఈఓగా వినయ్​ దూబె నియామకమయ్యారు. ఆయన ఇప్పటివరకు సంస్థ సలహాదారుడి హోదా​లో పని చేశారు. కొర్నేలీజ్ వ్రీసే​విజ్​ సీఈఓగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత గో ఎయిర్ సీఈఓ పదవి ఇప్పటివరకు ఖాళీగానే ఉంది.

GoAir appoints Vinay Dube as CEO
గోఎయిర్​ నూతన సీఈఓగా వినయ్​ దూబె

By

Published : Feb 15, 2020, 5:51 AM IST

Updated : Mar 1, 2020, 9:30 AM IST

గోఎయిర్​ విమానయాన సంస్థ నూతన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా(సీఈఓ) వినయ్​ దూబె శుక్రవారం నియామకమయ్యారు. ఇప్పటి వరకు గో ఎయిర్​లో సలహాదారుడిగా పని చేశారు దూబె. గత ఏడాది మే నెలలో జెట్​ ఎయిర్​వేస్ ​బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన.. అనంతరం గో ఎయిర్​లో చేరారు. దూబె ఇంతకుముందు డెల్టా ఎయిర్​ లైన్స్​లో ఆసియా పసిఫిక్​ విభాగం ​ఉపాధ్యక్షుడిగా, డెల్టా టెక్నాలజీలో సీఈఓగా విధులు నిర్వహించారు.

గో ఎయిర్​ బోర్డు సభ్యులు దూబెను సీఈఓగా నియమించడానికి ఆమోదం తెలిపినట్లు ఆ సంస్థ చైర్మన్​ మేనేజింగ్​ డైరెక్టర్​ జే​ వాడియా ప్రకటించారు. కొర్నెలీజ్​ వ్రీస్​విజ్​ సీఈఓగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఇంతవరకు ఆ స్థానం ఖాళీగానే ఉంది.

20వేల మందికి పైగా ఉద్యోగులున్న గో ఎయిర్​ సీఈఓ విధులను సమర్థంగా నిర్వహించి, కంపెనీ లక్ష్యాలు సాధించటం కోసం దూబె కృషి చేస్తారని వెల్లడించారు సంస్థ నిర్వాహకులు.

ఇదీ చూడండి:వారం రోజుల్లో 10వేల కోట్లు చెల్లిస్తాం: ఎయిర్​టెల్​

Last Updated : Mar 1, 2020, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details