తెలంగాణ

telangana

ETV Bharat / business

గో ఎయిర్​ ఐపీఓ లక్ష్యం రూ.3,600 కోట్లు! - గో ఎయిర్​ పేరు మార్పునకు కారణాలు

రూ.3,600 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతోంది బడ్జెట్ విమానయాన సంస్థ గో ఎయిర్​. ఇందుకు సంబంధించిన ప్రాథమిక డ్రాఫ్ట్​ను దాఖలు చేసినట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

Go Air IPO size
గో ఎయిర్ ఐపీఓ న్యూస్

By

Published : May 14, 2021, 2:05 PM IST

బడ్జెట్​ విమానయాన సంస్థ గో ఎయిర్​ ఇనీషియల్ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ) కోసం ప్రాథమిక దరఖాస్తు దాఖలు చేసింది. తాజాగా బ్రాండ్​ పేరును గో ఫస్ట్​గా మార్చుకున్న ఈ సంస్థ రూ.3,600 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు రానున్నట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గో ఎయిర్​ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వాడియా గ్రూప్​ సంస్థ అయిన గో ఎయిర్​ కార్యకాలపాలు ప్రారంభించి 15 ఏళ్లైంది. బడ్జెట్​ ఎయిర్​లైన్​ సంస్థగా మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే సంస్థ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. దీనితో పాటు రూ.1,500 కోట్ల ప్రీ ఐపీఓ ప్లేస్​మెంట్​ ద్వారా సేకరించాలని భావిస్తోంది.

ఐపీఓ ప్రక్రియ పూర్తయితే.. ఇండిగో, స్పైస్​జెట్​ తర్వాత భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యే మూడో సంస్థగా నిలవనుంది గో ఎయిర్​.

ఇదీ చదవండి:గోఫస్ట్‌గా పేరు మార్చుకున్న గోఎయిర్‌.. ఎందుకంటే!

ABOUT THE AUTHOR

...view details