ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ 1,225 మంది కార్మికులను విధుల నుంచి తప్పించింది. కెనడా, అమెరికాలో కార్మికుల సమ్మె రెండో వారానికి చేరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కార్మికుల సమ్మెతో.. మొరైన్, ఒహాయోలో డీమాక్స్ ఇంజన్ ప్లాట్‌లో 525 మందిని తప్పించింది. డీమాక్స్ ప్లాంట్ జనరల్ మోటార్స్‌కు అనుబంధ సంస్థ. ఇందులో 60 శాతం వాటా జనరల్ మోటార్స్‌కు.. 40 శాతం వాటా ఇసూజూ సంస్థకు ఉంది.
కెనడాలోని మరో ప్లాంట్‌లో 700 మంది కార్మికులను తాత్కాలిక సెలవులపై పంపినట్లు జనరల్ మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలే కెనడాలోని ఒసావాలో ఉన్న కార్లు, ట్రక్కుల ప్లాంట్ లో పని చేసే 2,000 మంది ఉద్యోగులకు తాత్కాలిక సెలవులివ్వడం గమనార్హం.