తెలంగాణ

telangana

ETV Bharat / business

'కరోనా భూతం వల్ల ప్రపంచానికి మాంద్యం ముప్పు' - చైనాపై కరోనా ప్రభావం

కరోనా వైరస్​ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని మూడీస్​ అనలిటిక్స్​ అభిప్రాయపడింది. చైనా సహా పలు దేశాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారిని అడ్డుకోకపోతే ప్రపంచం మొత్తం మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేసింది.

Global recession likely if coronavirus becomes pandemic
కరోనాను అడ్డుకోకుంటే ఆర్థిక మాంద్యమే

By

Published : Feb 26, 2020, 3:35 PM IST

Updated : Mar 2, 2020, 3:36 PM IST

కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోకుంటే ప్రపంచం మొత్తం మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మూడీస్‌ అనలిటిక్స్ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ మహమ్మారి.. ఇటలీ, దక్షిణ కొరియానూ వణికిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

కరోనా వైరస్‌ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని .. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకూ అనేక సవాళ్లు విసురుతోందని మూడీస్​ అనలిటిక్స్​ ముఖ్య ఆర్థికవేత్త మార్క్​ జండీ వివరించారు.

పర్యటనలు రద్దు..

కరోనా వల్ల ఇప్పటికే చైనీయుల వ్యాపార ప్రయాణాలు, ఇతర పర్యటనలు రద్దయ్యాయని మూడీస్​ తెలిపింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు చైనాకు సేవలు నిలిపేశాయని, ఆసియా-పసిఫిక్​ ప్రాంతాలకు నౌకల సేవలనూ ఆపేస్తున్నట్లు గుర్తుచేసింది.

ధరలు పెరగొచ్చు..

చైనాలో ఫ్యాక్టరీలు మూతపడడం కారణంగా చైనా దిగుమతులపై ఆధారపడిన అనేక దేశాల్లోని పరిశ్రమలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. చైనా నుంచి దిగుమతులు తగ్గిన కారణంగా అమెజాన్, వాల్​మార్ట్​లలో కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని మూడీస్ అనలిటిక్స్​ పేర్కొంది. ఇంకొన్నాళ్లు పరిస్థితి ఇలాగే కొనసాగితే మాంద్యం ముప్పు తప్పదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వజ్రాలు అన్వేషణ'

Last Updated : Mar 2, 2020, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details