రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి' సరఫరాకు సంబంధించి హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మా.. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 25.2 కోట్ల స్పుత్నిక్ వి డోసులను గ్లాండ్ ఫార్మా ఉత్పత్తి చేసి, సరఫరా చేయనుంది.
రష్యా టీకా ఉత్పత్తికి గ్లాండ్ ఫార్మా ఒప్పందం - స్పుత్నిక్ వీ టీకా సరఫరాకు గ్లాండ్ ఫార్మా కీలక ఒప్పందం
హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మా, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో రష్యా కరోనా టీకా 'స్పుత్నిక్ వి'.. 25.2 కోట్ల డోసులను గ్లాండ్ ఫార్మా ఉత్పత్తి చేసి, సరఫరా చేయనుంది.
స్పుత్నిక్ టీకా సరఫరాకు గ్లాండ్ ఫార్మా ఒప్పందం
హైదరాబాద్లో కంపెనీకి ఉన్న ఔషధ ఉత్పత్తి కేంద్రాల్లో ఈ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో టీకాల ఉత్పత్తి ప్రారంభించి.. నాలుగో త్రైమాసికం నుంచి వాటిని డెలివరీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:మీడియాలో వాటా విక్రయానికి జాక్ మాపై చైనా ఒత్తిడి!