తెలంగాణ

telangana

ETV Bharat / business

అతి తక్కువ ధరకే 10,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఫోన్‌! - Gionee M30 mobile news

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ జియోనీ ఎం30 పేరుతో కొత్త ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. 10,000ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్​ అతి తక్కువ ధరకే లభించనుంది. మరి ధరెంతో తెలుసా?

Gionee introduces M30 with massive battery
అతి తక్కువ ధరకే 10,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఫోన్‌!

By

Published : Aug 27, 2020, 10:50 PM IST

ప్రస్తుతం మొబైల్ ఫోన్‌ సంస్థల మధ్య తీవ్రపోటీ నెలకొంది. వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్‌ అందించేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా జియోనీ సంస్థ ఎం30 పేరుతో కొత్త ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో రానున్న ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, భద్రత కోసం ఎన్‌క్రిప్షన్ చిప్‌ వంటి ఫీచర్స్‌ను ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6 అంగుళాల ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇస్తున్నారు. మీడియాటెక్‌ హీలియో పీ60 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం ఈ ఫోన్‌లో రెండు కెమెరాలు ఉన్నాయి. వెనుక 16 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్‌తో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ ఫీచర్‌ కూడా ఉంది.

ఈ ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ గురించి. 10,000ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 25 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు రివర్స్‌ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే లభించనున్న ఈ ఫోన్‌ ధర 1,399 యువాన్లు. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.15,000. బ్లాక్‌ కలర్‌లో మాత్రమే లభించనుంది. మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఫోన్‌ వెనకవైపున లెదర్‌ ఫినిషింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఎం30 అమ్మకాలు చైనాలో మాత్రమే నిర్వహించనున్నారు. భారత్‌లో విడుదల తేదీ గురించి ఎలాంటి సమాచారం లేదు.

ఇదీ చూడండి:వాట్సాప్​లో అదిరే కొత్త ఫీచర్లు.. అవేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details