తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడు ఎంఎస్​ఎఈ సదస్సు ప్రారంభించనున్న గడ్కరీ - ఎంఎస్​ఎంఈ అంతర్జాతీయ దినోత్సవం

ఎంఎస్​ఎంఈ అంతర్జాతీయ సదస్సును దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ఎంఎస్​ఎంఈ దినోత్సవం సందర్భంగా ఈ సదస్సును నిర్వహించనున్నారు.

నేడు ఎంఎస్​ఎఈ సదస్సు ప్రారంభించనున్న గడ్కరీ

By

Published : Jun 27, 2019, 7:31 AM IST

దిల్లీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అంతర్జాతీయ సదస్సును కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ నేడు ప్రారంభిస్తారు. అంతర్జాతీయ ఎంఎస్​ఎంఈ దినోత్సవం సందర్భంగా దేశంలో సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టనున్నారు.

ఎంఎస్​ఎంఈలకు ప్రోత్సాహం అందించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎంఎస్​ఎంఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వ్యాపార, వాణిజ్య భాగస్వాముల పరిచయ వేదికగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. దేశీయంగా ఎంపిక చేసిన కొన్ని సంస్థల ప్రతినిధులకు అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రమికవేత్తలకు మధ్య పరస్పర చర్చలు జరగనున్నాయి.

సదస్సులో మొత్తం 44 దేశాల నుంచి 175 మంది ఎంఎస్​ఎంఈ ప్రతినిధులు పాల్గొంటారు. ఐరోపా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలోని 15 దేశాల అంబాసిడర్లు హాజరుకానున్నారు.

ఇదీ చూడండి: 'నగదు చెల్లింపుల సమాచారం దేశం దాటోద్దు'

ABOUT THE AUTHOR

...view details