తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్ కేసు తీర్పును సవాలు చేసిన ఫ్యూచర్

అమెజాన్​తో వివాదంలో దిల్లీ హైకోర్టులోని డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించింది ఫ్యూచర్ రిటైల్​. రిలయన్స్ రిటైల్​తో ఒప్పందం విషయంలో ముందుకెళ్లొద్దని ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. పిటిషన్ దాఖలు చేసింది.

Future Group move to division bench on Amazon issue
అమెజాన్​ వివాదంలో దిల్లీ హైకోర్ట్ డివిజన్​ బెంచ్​కు ఫ్యూచర్​ గ్రూప్

By

Published : Mar 21, 2021, 1:05 PM IST

అమెజాన్​ను కాదని.. రిలయన్స్ రిటైల్​తో​ ఒప్పందం విషయంలో ముందుకెళ్లొద్దని దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును.. డివిజన్​ బెంచ్​ వద్ద సవాలు చేసింది ఫ్యూచర్​ గ్రూప్.

రిలయన్స్​ రిటైల్​తో ప్యూచర్​ గ్రూప్ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంలో సింగపూర్​ ఆర్బిట్రేషన్​ ప్యానెల్​ తీర్పును సమర్థిస్తూ.. జస్టిస్ ఆర్​జే మిధా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం గత వారం తీర్పునిచ్చింది. ఫ్యూచర్​ రిటైల్​​ సింగపూర్​ ఆర్బిట్రేటర్స్​ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పేర్కొంది. రిలయన్స్​ రిటైల్​తో ఒప్పందంలో ఏ మాత్రం ముందుకెళ్లొద్దని ఫ్యూచర్​ గ్రూప్​ను ఆదేశించింది.

ఫ్యూచర్​ గ్రూప్​ అధినేత కిశోర్​ బియానీ సహా ఇతర సంబంధితులు తమ ఆస్తుల వివరాలతో ఏప్రిల్​ 28న కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. అత్యవసర ఆర్బిట్రేటర్స్​ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 3 నెలల పాటు ఎందుకు జైలులో పెట్టకూడదో కూడా వివరించాలని బియానీని ఆదేశించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details