రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టేందుకు సామాజిక మధ్యమ దిగ్గజం ఫేస్బుక్ సిద్ధమైంది. జియో ప్లాట్‌ఫాం లిమిటెడ్‌లోని మైనారిటీ(10శాతం) వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జియో ప్లాట్‌ఫాంలో 5.7 బిలియన్ డాలర్ల(రూ.43,574 కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
"రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సంస్థ జియో ప్లాట్‌ఫాం లిమిటెడ్‌లో 5.7 బిలియన్ డాలర్లు(రూ.43,574కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటిస్తున్నాం. దీంతో జియోలో ఫేస్బుక్ అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా అవతరిస్తుంది."-ఫేస్బుక్ ప్రకటన