నిత్యం ఎన్నో కంపెనీలు, బ్రాండ్ల పేర్లు మనం వింటూనే ఉంటాం. ఇందులో చాలా పేర్లు సంక్షిప్తంగానే ఉంటాయి. నిజానికి ఆ పేర్లే చాలా మందికి సుపరిచితం అయితే అలా సంక్షిప్తంగా ఉన్న కంపెనీల పూర్తి పేర్లు మాత్రం చాలా మందికి తెలియవు. అలా ఎక్కువ మందికి సుపరిచితమైన బ్రాండ్ల పూర్తి పేర్లు.. వాటికి సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డీఎల్ఎఫ్
డీఎల్ఎఫ్ పూర్తి పేరు 'దిల్లీ ల్యాండ్&ఫినాన్స్'. స్థిరాస్తి రంగంలో సేవలిందిస్తున్న ఈ సంస్థను 1946లో సీహెచ్.రాఘవేంద్ర సింగ్ స్థాపించారు. ఈ సంస్థ ప్రస్తుతం అనేక నివాస సముదాయాలు, షాపింగ్ మాల్స్, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో వ్యాపార కేంద్రాలను నిర్వహిస్తోంది.
బీపీఎల్
బీపీఎల్ దాదాపు 10 ఏళ్ల క్రితం వరకు భారతీయ ఎలక్ట్రానిక్ బ్రాండ్లలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. బీపీఎల్ పూర్తి పేరు 'బ్రిటీష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్'. పేరులో బ్రిటీష్ ఉన్నా ఇది భారతీయ కంపెనీనే. బీపీఎల్ 1963లో స్థాపించారు. ఈ సంస్థ టీవీలకు ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండేది. అయితే మార్కెట్లోకి ఎల్జీ, శాంసంగ్‌ల రాకతో బీపీఎల్‌కు ఆదరణ తగ్గింది.
ఫీయట్ (ఎఫ్ఐఏటీ)
కార్ల బ్రాండ్లలో ఫీయట్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే చాలా మంది ఫీయట్ అనేదే ఈ సంస్థ పూర్తిపేరు అనుకుంటారు. కానీ అది తప్పు. ఫీయట్ పూర్తి పేరు 'ఫాబ్రికా ఇటాలియానా ఆటోమొబిలి టొరినొ'. 1899లో స్థాపితమైన ఫీయట్ ఇటలీలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.
హెచ్డీఎఫ్సీ
బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో హెచ్డీఎఫ్సీ గ్రూప్ దూసుకుపోతోంది. హెచ్డీఎఫ్సీ పూర్తిపేరు 'హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్'. హెచ్‌డీఎఫ్‌సీని 1977లో హస్ముఖ్భాయ్ పరేఖ్ స్థాపించారు.
ఐబీఎం
టెక్ దిగ్గజాల ప్రస్తావన వచ్చిందంటే అందులో ఐబీఎం పేరు తప్పకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం ఎంతో మందికి సుపరిచితం. ఐబీఎం పూర్తి పేరు 'ఇంటర్నేషనల్ బిజినెస్ మిషిన్స్' కార్పొరేషన్. ఈ టెక్ దిగ్గజాన్ని 1911లో ఛార్లెస్ రాన్లెట్ స్థాపించారు. ఐబీఎం ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది.
హెచ్‌టీసీ