పబ్లిక్ ఇష్యూలకు మదుపర్ల నుంచి మంచి స్పందన వస్తుండటం వల్ల మరిన్ని కంపెనీలు ఇదే బాట పడుతున్నాయి. ఈ వారంలో మరో 4 ఐపీఓలు, రూ.14,628 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఇప్పటివరకు 16 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.30,666 కోట్లు సమీకరించాయి.
ఈ వారంలో మరో 4 ఐపీఓలు- ఏంటంటే? - ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫైనాన్స్
మార్కెట్లో ఐపీఓల జోరు నడుస్తోంది. ఈ వారం నిర్మా గ్రూప్‌నకు చెందిన నువాకో విస్టాస్ కార్పొరేషన్, కార్‌ట్రేడ్ టెక్ సహా నాలుగు సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. ఈ ఐపీఓలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
IPO
తాజా ఐపీఓలు..:నిర్మా గ్రూప్‌నకు చెందిన నువాకో విస్టాస్ కార్పొరేషన్, కార్‌ట్రేడ్ టెక్ కంపెనీల ఐపీఓలు నేడు (సోమవారం); ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ ఐపీఓలు మంగళవారం మొదలు కానున్నాయి.
- నువాకో విస్టాస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా తాజాగా రూ.1,500 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. ప్రమోటర్ నియోగి ఎంటర్‌ప్రైజ్ రూ.3,500 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.560-570.
- కార్‌ట్రేడ్ టెక్ ఐపీఓ ద్వారా గరిష్ఠంగా రూ.2,998.51 కోట్లను సమీకరించనుంది. ఈ ఇష్యూకు రూ.1,585-1,618 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది.
- ఆప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో రూ.500 కోట్లు తాజా షేర్ల ఇష్యూ ద్వారా సమీకరించనుండగా, 6,45,90,695 షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదార్లు ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నారు. మొత్తం రూ.2,780 కోట్లు సమీకరించనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.346-353.
- కెమ్‌ప్లాస్ట్ సన్మార్ తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ ద్వారా రూ.1,300 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్‌లో రూ.2,550 కోట్లు సమీకరించనుంది. ఇష్యూకు ధరల శ్రేణి రూ.530-541.
ఇదీ చూడండి:ఓయోలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి?