తెలంగాణ

telangana

ETV Bharat / business

సోనీ వాక్​మెన్​ వచ్చి 40 ఏళ్లు గడిచిపోయాయి..! - సోనీ

రోజూ ఉరుకుల పరుగులతో సాగే జీవితంలో ఉపసమనాన్నిచ్చే వాటిలో సంగీతం ఒకటి.. మరి 40 ఏళ్ల క్రితం వాటిని ఎలా వినేవారు..అప్పటి సాంకేతికతతో సంగీతం వినడానికి సోనీ కంపెనీ తీసుకొచ్చిన మార్పులేంటి.? అసలు పాటలు వినడానికి అప్పుడు ఉన్న మార్గాలేంటి?

సోనీ వాక్​మెన్​ వచ్చి 40 ఏళ్లు గడిచిపోయాయి..!

By

Published : Jul 1, 2019, 5:02 AM IST

Updated : Jul 1, 2019, 8:45 AM IST

సోనీ వాక్​మెన్​ వచ్చి 40 ఏళ్లు గడిచిపోయాయి..!
సంగీతం మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది..వ్యాయామం, ప్రయాణం, ఒత్తిడి ఇలా చాలా సమస్యలకు ఔషధంగా మారింది. కానీ 40 ఏళ్ల క్రితం సంగీతం వినాలంటే పెద్ద పెద్ద యంత్ర పరికరాలను ఉపయోగించేవారు. ప్రయాణాల్లో వాటిని తీసుకెళ్లడం జరగని పని. ఆ సమయంలో సోనీ కంపెనీ పరిచయం చేసింది వాక్​మన్...​ అంటే పోర్టబుల్​ టేప్​ ప్లేయర్​.

1979 లో టీపీఎస్​-ఎల్​2 మోడల్​.. మొదటి స్టీరియో క్యాసెట్ ప్లేయర్​ని 150 డాలర్లతో విపణి​లోకి తీసుకొచ్చింది సోనీ. 1980కి వచ్చేసరికి వాక్​మెన్​ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఎంతగా అంటే ప్రవేశపెట్టిన మొదటి మోడల్​ ఏకంగా 220 మిలియన్​ ప్లేయర్స్ కొనుగోలయ్యాయి.

సాంకేతిక విప్లవం:

1984 లో డబ్ల్యూఎమ్​-ఎఫ్5 మోడల్​తో సోనీ 'స్పోర్ట్స్ వాక్​మెన్'​ ని ప్రవేశ పెట్టగా వాటి వినియోగం పెరిగిపోయింది. జాగింగ్, వ్యాయామం, ప్రయాణం ఇలా అన్ని చోట్లా వినియోగదారులు వాడటం మొదలుపెట్టారు.

ఆ తరవాత వీటి సాంకేతికతలో మార్పులు చోటుచేసుకున్నాయి.. అదే సంవత్సరంలో 'డిస్క్​మెన్' అంటే ​పోర్టబుల్​ సీడీ ప్లేయర్​ని సోనీ తీసుకొచ్చింది. 1986 లో వచ్చిన డబ్ల్యూఎమ్​-ఎఫ్63 వాటర్​ రెసిస్టెంట్​ ప్లేయర్స్ అప్పటివరకు ఉన్న టెక్నాలజీలో విప్లవాన్నే తెచ్చాయి. 4 ఏళ్లలోనే జనాల్లో మంచి ఆదరణ పొందింది.
21వ శతాబ్దం లో మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సోనీ వాక్​మన్​లో మార్పులు వచ్చాయి. దాదాపు 110 నుండి 2500 డాలర్ల ఖరీదు, 48 గంటల బ్యాటరీ సామర్థ్యంతో 125జీబీ (జిగా బైట్) కలిగిన వాక్​మన్​లను అందుబాటులోకి తెచ్చింది సంస్థ.

టెక్నాలజీలో వస్తోన్న మార్పుల గురించి 'మ్యూజియం ఆఫ్​ పోర్టబుల్​ సౌండ్​' అనే సంస్థ డైరెక్టర్​, రచయత జాన్​ కన్నెన్​బర్గ్​ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"1980లో పరిచయమైన వాక్​మన్​తో చాలా మార్పులు వచ్చాయి. ప్రజలు వీటి సాయంతో పాటలు వింటూ జాగింగ్​, ఏరోబిక్స్​ వంటి వ్యాయామాలు చేసేవారు. ప్రజలు ఇళ్ల బయటకు వచ్చి వ్యాయామాలు చేయడం వల్ల కొత్త సంస్కృతి ఏర్పడింది."
-జాన్​ కన్నెన్​బర్గ్, రచయత

ఇప్పటికి సోనీ మొదటి వాక్​మెన్​ని పరిచయం చేసి 40 వసంతాలు పూర్తయింది. పెరుగుతున్న స్మార్ట్ ఫోన్​ వాడకం కారణంగా పోర్టబుల్​ మీడియా ప్లేయర్లు క్రమంగా తగ్గాయి. కానీ ఇప్పుడు మనం వింటున్న సంగీతం వాటి పుట్టుకతోనే మొదలైంది.

ఇదీ చూడండి: అక్రమ సిగరెట్ల తయారీకి అడ్డాగా భారత్​!

Last Updated : Jul 1, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details