తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్​ఐఐటీ నూతన ఛైర్​పర్సన్​గా ఇస్రో మాజీ ఛైర్మన్ - ఎన్​ఐఐటీ ఛైర్పర్సన్​గా కస్తూరీ రంగన్​

ఎన్​ఐఐటీ యూనివర్సిటీ నూతన ఛైర్​పర్సన్​గా ఇస్రో మాజీ ఛైర్మన్​ కస్తూరీ రంగన్ ఎంపికయ్యారు. మాజీ పార్లమెంట్​ సభ్యుడు.. కరణ్​ సింగ్​ స్థానంలో రంగన్​కు ఈ అవకాశం దక్కింది.

కస్తూరీ రంగన్​

By

Published : Nov 23, 2019, 6:41 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' మాజీ ఛైర్మన్​ కె.కస్తూరీ రంగన్​ ఎన్​ఐఐటీ విశ్వవిద్యాలయ నూతన ఛైర్​పర్సన్​గా నియమితులయ్యారు. రాజస్థాన్​లోని నిమరణలో జరిగిన యూనివర్సిటీ 11 వార్షిక లెక్చర్​లో అధికారికంగా ఈ ప్రకటన వెలువడింది. పార్లమెంట్​ మాజీ సభ్యుడు కరణ్​ సింగ్​ స్థానంలో.. కస్తూరీ రంగన్ ఈ పదవికి ఎంపికైనట్లు ప్రకటన పేర్కొంది.

కస్తూరీ రంగన్​ 1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్​గా వ్యవహరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్​​ దక్కింది.

కస్తూరీ రంగన్​ అనుభవం ఎన్​ఐఐటీ దృక్పథాన్ని.. విలువలను మరింత బలోపేతం చేసేందుకు దోహదం చేస్తాయని.. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్​ రాజేంద్ర ఎస్​ పవార్ అశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:వాట్సాప్​ వెబ్​లో ఈ ట్రిక్​లు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details