తెలంగాణ

telangana

ETV Bharat / business

హెచ్​డీఎఫ్​సీ నూతన ఛైర్మన్​గా మాజీ ఐఏఎస్!

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ నూతన ఛైర్మన్​గా.. మాజీ ఎకనామిక్​ అఫైర్స్ సెక్రటరీ అటాను చక్రవర్తి బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఛైర్మన్​గా ఉన్న​ శ్యామలా గోపినాథ్ పదవీకాలం జనవరి 1న ముగియనుంది.

By

Published : Dec 30, 2020, 6:03 AM IST

Former Economic Affair Secretary Atanu Chakraborty likely to be next HDFC Bank Chairperson
హెచ్​డీఎఫ్​సీ నూతన ఛైర్మన్​గా మాజీ ఐఏఎస్!

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ నూతన ఛైర్మన్​గా.. మాజీ ఎకనామిక్​ అఫైర్స్ సెక్రటరీ అటాను చక్రవర్తి పేరును ఖరారు చేసింది హెచ్​డీఎఫ్​సీ బోర్డు. ఈ మేరకు ఆర్​బీఐ అనుమతి కోసం అటాని పేరును సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఛైర్మన్​గా కొనసాగుతున్న శ్యామలా గోపినాథ్​ పదవీకాలం జనవరి 1న ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది హెచ్​డీఎఫ్​సీ.

అటాను చక్రవర్తి 1985, గుజరాత్​ క్యాడర్ ఐఏఎస్​ అధికారి. హెచ్​డీఎఫ్​సీ ఛైర్మన్​గా అటాను నియామకం జరిగితే.. మాజీ ఐఏఎస్ అధికారి ఛైర్మన్​గా ఉన్న రెండో బ్యాంకుగా హెచ్​డీఎఫ్​సీ నిలువనుంది.

ఇదీ చదవండి :31 ఆఖరు- 4.15 కోట్ల ఐటీఆర్​లు దాఖలు

ABOUT THE AUTHOR

...view details