తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టేట్​ బ్యాంక్​ సేవల్లో 3 మార్పులు... నేటి నుంచే అమలు...

మీరు ఎస్​బీఐ ఖాతాదారులా? అయితే నేటి నుంచి మీ బ్యాంకు కొన్ని కీలక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

SBI
ఎస్​బీఐ

By

Published : Jan 1, 2020, 3:38 PM IST

భారతీయ స్టేట్​ బ్యాంకు (ఎస్​బీఐ) నేటి నుంచి మూడు కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. మీరు ఎస్​బీఐ ఖాతాదారులు అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

ఏటీఎం లావాదేవీలకు ఓటీపీ

ఎస్​బీఐ ఖాతాదారులు రూ.10,000లకు పైగా ఏటీఎం ద్వారా నగదు డ్రా చేయాలంటే నేటి నుంచి ఓటీపీ ఇవ్వాల్సి వస్తుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య జరిగే లావాదేవీలపై ఈ నిబంధన వర్తించనుంది.

ఎస్​బీఐ పాత డెబిట్​కార్డులు ఇకపై చెల్లవ్​..

ఎస్​బీఐ మ్యాగ్నటిక్​ స్ట్రిప్స్​ డెబిట్ కార్డులు నేటి నుంచి పని చేయడం మానేశాయి. ఈ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్​ కార్డుకు అప్​డేట్​ చేసుకోవాలని ఖాతాదారులకు ఇప్పటికే సూచించింది ఎస్​బీఐ. ఆన్​లైన్​ లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు ఈ కార్డులను తీసుకువచ్చింది ఎస్​బీఐ.

స్టేట్​ బ్యాంక్​ రుణాలు మరింత చౌక..

'ఎక్స్​టర్నల్​ బెంచ్​మార్క్​ ఆధారిత వడ్డీ రేటు' (ఈబీఆర్​)ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ఎస్​బీఐ. ఈ వడ్డీ రేట్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పుడున్న ఈ కీలక వడ్డీ రేటు 8.05 నుంచి 7.80 శాతానికి దిగిరానుంది.

ABOUT THE AUTHOR

...view details