ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు(Flipkart) ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టం(foreign exchange management act) నిబంధనల ఉల్లంఘన కింద నోటీసులు పంపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(enforcement directorate). రూ.10,600 కోట్ల మేర జరిమానా(penalty on flipkart) ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంస్థ వ్యవస్థాపకులతో పాటు మరో తొమ్మిది మందికి ఈ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది.
ఈ నోటీసులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్.
" 2010లో నేను ఫ్లిప్‌కార్ట్ సంస్థ నుంచి బయటకు వచ్చేశాను. కంపెనీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. చాలా సందర్భాల్లో ఈడీకి ఈ విషయాన్ని వివరించాను. కానీ, 12 ఏళ్ల తర్వాత నాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులను ఉపసంహరించుకోవాలి. "