తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్​లో షాపింగే కాదు... ఇక వినోదం కూడా... - నెట్​ఫ్లిక్స్

ఆమెజాన్​ ప్రైమ్, నెట్​ ​ఫ్లిక్స్​లకు పోటీగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ వీడియో సర్వీసులను ప్రారంభించింది. ఫ్లిప్​కార్ట్ మొబైల్​యాప్​ అప్​డేట్ వర్షన్​లో ఈ వీడియో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

వీడియో సేవల్లోకి ఫ్లిప్​కార్ట్

By

Published : Aug 19, 2019, 5:36 AM IST

Updated : Sep 27, 2019, 11:33 AM IST

వాల్​మార్ట్​ ఆధీనంలోని ఈ కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను ప్రారంభించింది. ఈ సేవల కోసం ప్రస్తుతమున్న మొబైల్​ యాప్​ను అప్​డేట్ చేసుకోవాలని వెల్లడించింది ఫ్లిప్​కార్ట్.

ఆమెజాన్​ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్​ల మాదిరిగా.. వినియోగదారులు ఎంపిక చేసిన, వారుకోరుకున్న వీడియో కంటెంట్​ను చూసే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. వీడియో కంటెంట్​ కోసం డైస్​ మీడియా, టీవీఎఫ్​, వూట్​ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో కొత్త కంటెంట్​ను తీసుకురానున్నట్లు ఫ్లిప్​కార్ట్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.

వీడియో సర్వీసులు పొందడం ఎలా?

వీడియోస్ట్రీమింగ్‌ సర్వీసును ఉపయోగించుకునేందుకు వినియోగదారులు వీ6.17 వెర్షన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఒక సారి మీ యాప్‌ అప్‌డేట్​ అయితే మీరు ఈ సర్వీసును హ్యామ్‌బర్గర్‌ మెనూలోకి వెళ్లి వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ వీడియో కంటెంట్​ను ప్రకటనలు లేకుండానే అందిస్తోంది ఫ్లిప్​కార్ట్.

ఇదీ చూడండి: బందర్ వజ్రాల గనిలో త్వరలోనే తవ్వకాలు

Last Updated : Sep 27, 2019, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details