దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీగా నిధులు సమీకరించింది. జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (సీపీపీ ఇన్వెస్ట్మెంట్), సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్2, వాల్‌మార్ట్‌ల ద్వారా 3.6 బిలియన్ డాలర్లు (రూ.26,805.6 కోట్లు) సమీకరించినట్లు తెలిపింది. ఈ నిధుల సమీకరణతో కంపెనీ విలువ 37.6 బిలియన్ డాలర్ల (రూ.28,00,35,40,00,000) మార్క్ దాటినట్లు తెలిపింది ఫ్లిప్‌కార్ట్.
ఫ్లిప్‌కార్ట్‌కు నిధులు సమకూర్చిన సంస్థల్లో.. ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సావరిన్ ఫండ్స్ డిస్రప్ట్ ఏడీ, ఫ్రాంక్లిన్ టెపుల్టన్, టైగర్ గ్లోబల్ వంటి సంస్థలు ఉన్నట్లు పేర్కొంది.