తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్​ నుంచి సైబర్ బీమా- ప్రీమియం ఎంతంటే? - డిజిటల్ సురక్ష బీమా

ఆన్​లైన్ షాపింగ్​లో ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోయాయి. ఇప్పడు మళ్లీ పంపడుగ సీజన్ విక్రయాల్లో సైబర్ నేరాలు భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బజాజ్ అలియాంజ్​ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి.. వినియోగదారులకు బీమా ఆఫర్​ను ప్రకటించింది ఫ్లిప్​కార్ట్. మరి ఆ బీమా ఎలా పొందాలి? ప్రీమియం ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

What is Flipkart Cyber Fraud insurance
ఫ్లిప్​కార్ట్ డిజిటల్ సురక్ష బీమా

By

Published : Sep 29, 2020, 4:42 PM IST

దేశంలో కొన్ని రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఆన్​లైన్ విక్రయాలు భారీగా జరుగుతాయి. ఇదే సమయంలో సైబర్ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువే. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో సైబర్ నేరాల భయాలను తొలగించేందుకు సైబర్ ఇన్సూరెన్స్​ ఆఫర్​ను ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్. బజాజ్ అలియాంజ్​ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఈ సైబర్ బీమా పాలసీ అందించనున్నట్లు వెల్లడించింది

'డిజిటల్ సురక్ష గ్రూప్ ఇన్సూరెన్స్' పేరుతో ఈ పాలసీని ఇవ్వనున్నట్లు తెలిపింది ఫ్లిప్​కార్ట్. ఈ పాలసీ వివిధ రకాల ఆన్​లైన్ మోసాలు, సైబర్ దాడులు, ఆన్​లైన్ లావాదేవీలకు బీమా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

ప్రీమియం ఛార్జీలు ఇలా..

వినియోగదారులు అత్యల్పంగా రూ.183 ప్రీమయంతో రూ.50 వేల వరకు బీమా పొందొచ్చు. రూ.312 ప్రీమియంతో రూ.లక్ష వరకు, రూ.561తో రూ.2 లక్షల వరకు.. బీమా పొందే వీలుంది. వీటన్నింటికి 12 నెలల గడువు ఉంటుంది. బీమా కవర్​ను రూ.10 లక్షల వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది.

కొన్ని రకాల మొబైల్ మోడళ్లు, ల్యాప్​టాప్​లు, ట్యాబ్లెట్​లు, ఆడియో డివైజ్​లను ఫ్లిప్​కార్ట్​లో కొనుగోలు చేయడం ద్వారా ఈ పాలసీని పొందొచ్చు.

వేటికి బీమా..

అనధికారిక డిజిటల్ లావాదేవీతో ఆర్థిక నష్టం వస్తే (హామీ ఇచ్చిన మొత్తం వరకు) బీమా వర్తిస్తుంది.

డెబిట్​కార్డ్​, క్రెడిట్ కార్డ్​, డిజిటల్ వాలెట్స్, యూపీఐ/ఇంటర్నెట్ బ్యాంకింగ్ (అన్ని బ్యాంకుల సంబంధించి)లకు ఈ బీమా వర్తిస్తుంది.

ఇదీ చూడండి:పండుగ సీజన్​లో మిడ్​ రేంజ్ ​ఫోన్లదే హవా!

ABOUT THE AUTHOR

...view details