దేశవ్యాప్తంగా 16కోట్ల మంది వినియోగదారులకు ఆన్లైన్ ద్వారా వస్తు సరఫరా సేవలందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ సంస్థ.. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేసింది. 700 నగరాల్లో, 27వేల కిరాణా దుకాణాల ద్వారా వస్తు సరఫరా సేవలను అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ అధికారిక ప్రకటనలో తెలిపింది. వినూత్న కార్యచరణ ద్వారా ఈ-కామర్స్‌లో సరికొత్త విప్లవం రానుందని సంస్థ సీఈఓ తెలిపారు.
వచ్చే పండగ సీజన్, బిగ్ బిలియన్ డేస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ నిర్ణయంతో కస్టమర్స్ కి మరింత చేరువ కావడమే కాక, కిరాణా దుకాణాల యజమానులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు చేయూతనిస్తుందని పేర్కొంది.