భారత్లో లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో సేవలను తాత్కాలికంగా నిలిపేశాయి ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
"కేంద్ర హోంశాఖ మార్చి 24న ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మేం మా సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. వీలైనంత త్వరగా మా సేవలను పునరుద్ధరించి మీ ముందుకు వస్తాం."
- ఫ్లిప్కార్ట్
కొన్ని రోజులుగా ఈ-కామర్స్ వేదికగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను బయటికి రావద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించిన కారణంగా ఎక్కువ మంది ఆన్లైన్లోనే ఆహారం, గృహోపకరణాలు భారీ ఎ్తతున కొనుగోలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం కోసం రౌటర్లు, కేబుల్స్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు.