తెలంగాణ

telangana

ETV Bharat / business

నిరుద్యోగులకు ఫ్లిప్​కార్ట్​ శుభవార్త - ఫ్లిప్​కార్ట్​ ఇండియా

భారత్‌లో 70,000 కొత్త ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్టు ఫ్లిప్​కార్ట్​ ప్రకటించింది. అంతేకాకుండా.. పరోక్షంగా మరో 50వేలకిపైగా ఉద్యోగాలు తమ సంస్థ ద్వారా లభించనున్నట్టు వెల్లడించింది. కొవిడ్‌-19 ప్రభావానికి తోడు రానున్న పండగ సీజన్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

Flipkart announces 70,000 new jobs in India
70వేల ఉద్యోగాలు ఇవ్వనున్న ఫ్లిప్​కార్ట్​

By

Published : Sep 15, 2020, 10:43 PM IST

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలో ఉద్యోగాల కొరత తీవ్రమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. తాము భారత్‌లో 70,000 కొత్త ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయంతో పరోక్షంగా మరో 50వేలకి పైగా ఉద్యోగాలు లభించవచ్చని సంస్థ అంచనా వేసింది. కొవిడ్‌-19 ప్రభావానికి తోడు రానున్న పండగ సీజన్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెజాన్‌ 'ప్రైమ్‌ డే'కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్' ఆన్‌లైన్‌ కొనుగోలు మేళాను ప్రకటించింది. ఈ అతి పెద్ద సేల్‌ అక్టోబర్‌ 17 నుంచి 22 వరకు కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో తాము ప్రత్యక్ష ఉద్యోగాల నియామకమే కాకుండా సరఫరా చివరి దశలో అంటే ఉత్పత్తులను వినియోగదారుల ఇళ్లకు చేర్చేందుకు మరికొందరిని భాగస్వాములుగా చేసుకోనున్నామని సంస్థ వెల్లడించింది. ఇందుకుగాను 50,000లకు పైగా కిరాణా షాపులు, చిన్న దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. తాము కల్పించనున్న అవకాశాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, పికింగ్‌, ప్యాకింగ్‌, సార్టింగ్‌ తదితర ఉద్యోగాలు ఉంటాయని సంస్థ వివరించింది. చిన్న దుకాణాలతో చేసుకునే ఒప్పందాల వల్లా మరికొందరికి ఉపాధి దొరుకుతుందని సంస్థ వెల్లడించింది.

ఇదీ చూడండి:-అమెజాన్​లో లక్ష ఉద్యోగాల నియామకం

ABOUT THE AUTHOR

...view details