ప్రముఖ హోల్‌సేల్ వ్యాపార సంస్థ వాల్‌మార్ట్ ఇండియాను కొనుగోలు చేసినట్లు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గురువారం వెల్లడించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో ఆ వివరాలను తెలియజేయలేదు. ఆగస్టు నుంచి 'ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్' పేరుతో టోకు వ్యాపార కార్యకలాపాలను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
650 బిలియన్ డాలర్ల పరిమాణం ఉన్న భారత రిటైల్ విపణిలోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్ ఈ కొనుగోలు చేపట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 28 'బెస్ట్‌ప్రైస్' టోకు విక్రయకేంద్రాలను వాల్‌మార్ట్ ఇండియా నిర్వహిస్తోంది.
వాల్‌మార్ట్ నేతృత్వంలోని పెట్టుబడి సంస్థల బృందం నుంచి ఇటీవలే 1.2 బిలియన్ డాలర్ల నిధులను ఫ్లిప్‌కార్ట్ సమీకరించింది. ఇది జరిగిన వారం రోజులకే వాల్‌మార్ట్ ఇండియాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించడం గమనార్హం. 'ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్.. డిజిటల్ రూపేణా అందుబాటులోకి రానున్న కొత్త వేదిక. భారత్‌లోని బిజినెస్- టు- బిజినెస్ (బి-టు-బి) విభాగం అవసరాలపై ఇది దృష్టిపెడుతుంది. ఓ వైపు విక్రయదార్లను, తయారీదార్లను మరోవైపు కిరాణా దుకాణాలను, ఎంఎస్‌ఎమ్‌ఈలను ఇది సమర్థంగా అనుసంధానం చేస్తుంది.' అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఆదర్శ్ మీనన్ అన్నారు. కిరాణా దుకాణాలు, ఎంఎస్‌ఎంఈల అవసరాలను తీర్చే సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ కొనుగోలు లావాదేవీ ఉపయోగపడనుందని ఆయన తెలిపారు.
అమెజాన్‌కు గట్టి పోటీ..