తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండు గుడ్లకు రూ.1700 బిల్​పై మంత్రి ఆగ్రహం - రాహుల్ బోస్

అరటిపండ్లు, కోడిగుడ్లను భారీ ధరలకు అమ్ముతున్న ఫైవ్​ స్టార్​ హోటళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి రామ్​విలాస్​ పాసవాన్​. సదరు హోటళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మంత్రి

By

Published : Aug 13, 2019, 6:11 PM IST

Updated : Sep 26, 2019, 9:37 PM IST

వినియోగదారులకు ధరలతో చుక్కలు చూపిస్తున్న కొన్ని ఫైవ్​ స్టార్​ హోటళ్లపై కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాసవాన్​ మండిపడ్డారు. ఇటీవల అరటి పండ్లు, కోడిగుడ్ల ధరల విషయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయిన అంశాలపై స్పందించారు మంత్రి.

"ఫైవ్​స్టార్​ హోటళ్లలో అరటి పండ్లు, కోడిగుడ్ల బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం. గరిష్ఠ అమ్మకపు ధర(ఎమ్మార్పీ)కి మించి అమ్మడాన్ని మేం అంగీకరించం. ఈ అక్రమ వ్యాపారాలపై సదరు హోటళ్ల నుంచి వివరణ తీసుకుంటాం. తప్పు అని తేలితే చర్యలు తీసుకుంటాం."

-రామ్​విలాస్​ పాసవాన్​, కేంద్ర మంత్రి

ఈ నేపథ్యంలో ఇటీవల తీసుకొచ్చిన వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రస్తావించారు పాసవాన్. ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకునేందుకు చట్టంలో అన్ని నిబంధనలను పక్కాగా రూపొందించామని పేర్కొన్నారు.

బాలీవుడ్ నటుడు రాహుల్‌ బోస్‌ ట్విట్టర్​లో అరటిపండ్లపై చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. జులై 22న ఛండీగఢ్​లోని ఓ హోటల్​లో రెండు అరటిపండ్లకు రూ. 442.50 బిల్లు వేయడాన్ని నిరసిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. ఈ విషయంపై స్పందించిన ఛండీగఢ్‌ ఎక్సైజ్‌, పన్నుల శాఖ కమిషనర్‌ మణ్​దీప్‌ సింగ్‌ భర్‌ సంబంధిత హోటల్​కు రూ. 25 వేల జరిమానా విధించారు.

తాజాగా ముంబయిలో రెండు కోడిగుడ్లకు రూ.1,700 బిల్​ చేయటం మరింత చర్చకు దారితీసింది.

ఇవీ చూడండి:

రెండు కోడిగుడ్ల ధర రూ.1700 మాత్రమే

'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం

Last Updated : Sep 26, 2019, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details